Students | వైభవంగా సరస్వతీ యాగం…

Students | వైభవంగా సరస్వతీ యాగం…

అమ్మవారి పాదాల చెంత హాల్ టికెట్లు ఉంచి విద్యార్థుల ప్రత్యేక పూజలు..
పరీక్షల్లో విజయానికి వేలాది మంది విద్యార్థుల మొక్కులు..

Students | ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడ లోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గ మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో గురువారం సరస్వతీ యాగం వైభవంగా నిర్వహించారు. ఫాల్గుణ బహుళ నవమి సందర్భంగా, సరస్వతీ దేవికి అత్యంత ప్రీతిపాత్రమైన మూల నక్షత్రం పురస్కరించుకుని ఈ యాగాన్ని శాస్త్రోక్తంగా చేపట్టారు. ఉదయం 9 గంటలకు పాత చండీ యాగశాలలో ప్రారంభమైన ఈ యాగంలో అర్చకులు, వేదపండితులు విద్యార్థుల విద్యాభివృద్ధి, జ్ఞానవృద్ధి, పరీక్షల్లో విజయం కోసం ప్రత్యేక హోమాలు నిర్వహించారు.

విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం వేదమంత్రాల మధ్య యాగకార్యక్రమాలు కొనసాగాయి. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో విద్యార్థులు తమ హాల్ టికెట్లను అమ్మవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పరీక్షల్లో విజయాన్ని సాధించాలనే ఆకాంక్షతో తల్లిదండ్రులతో కలిసి ఆలయానికి చేరుకుని మొక్కులు చెల్లించారు.

Students |

వార్షిక పరీక్షల సమయంలో విద్యార్థులకు ఏకాగ్రత, మానసిక ధైర్యం కలగాలనే సంకల్పంతో ప్రతి సంవత్సరం ఈ ప్రత్యేక సరస్వతీ యాగం నిర్వహిస్తున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. భక్తులు, విద్యార్థులు అధిక సంఖ్యలో తరలివచ్చిన నేపథ్యంలో దేవస్థానం తరఫున తగిన ఏర్పాట్లు చేసి దర్శనాలను సజావుగా నిర్వహించారు.

Students |
Students |
Students |
Students |

CLICK HERE TO READ MORE : 10th century | మొగిలేశ్వర స్వామి క్షేత్ర చరిత్ర – భక్తుడు మొగిలప్ప గాథ

CLICK HERE TO READ MORE :

Leave a Reply