Students |పేద విద్యార్థుల చదువుకు బాబు, లోకేష్ భరోసా..

Students |పేద విద్యార్థుల చదువుకు బాబు, లోకేష్ భరోసా..


రూ.1200 కోట్ల ఫీజు రియంబర్స్ మెంట్ విడుదల..
శాప్ చైర్మన్ ఏ. రవి నాయుడు

Students | విజయవాడ, ఆంధ్రప్రభ;రాష్ట్రంలో పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు చదువుకు దూరం కాకుండా ప్రభుత్వం సంపూర్ణ బాధ్యత తీసుకుంటోందని శాప్ చైర్మన్ ఏ. రవి నాయుడు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు ₹1200 కోట్ల ఫీజు రీఎంబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయడం పేద విద్యార్థులకు పెద్ద శుభవార్త అని తెలిపారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ఫీజు రీఎంబర్స్‌మెంట్ బకాయిలు పేరుకుపోయి లక్షలాది మంది విద్యార్థులు తీవ్ర ఆర్థిక ఒత్తిడికి గురయ్యారని గుర్తుచేశారు. ఫీజులు చెల్లించలేక చదువులు మానేసిన సందర్భాలూ ఉన్నాయని చెప్పారు. అలాంటి పరిస్థితులకు ముగింపు పలికేలా ప్రస్తుత ప్రభుత్వం విద్యకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తోందని స్పష్టం చేశారు.

యువగలం పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చిన మాట ప్రకారం… ఎవ్వరూ ఆర్థిక ఇబ్బందులతో చదువు మానేయకూడదన్న లక్ష్యంతో ఈ నిధులు విడుదల చేశారు. పరీక్షల సమయం దగ్గరపడుతున్న వేళ విద్యార్థులపై భారం తగ్గించడం నిజంగా అభినందనీయమైన నిర్ణయం అని పేర్కొన్నారు. ఇంజినీరింగ్, డిగ్రీ, పీజీ, పాలిటెక్నిక్, నర్సింగ్ తదితర వృత్తి విద్యా కోర్సుల్లో చదువుతున్న లక్షలాది మంది విద్యార్థులకు ఈ నిధులు నేరుగా లబ్ధి చేకూరనున్నాయని తెలిపారు. ఫీజు రీఎంబర్స్‌మెంట్‌తో పాటు స్కాలర్‌షిప్ వ్యవస్థను మరింత పారదర్శకంగా, వేగవంతంగా అమలు చేయడానికి శాప్ సూచనలు చేస్తోందని అన్నారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో సమూల సంస్కరణలు తీసుకొస్తూ, డిజిటల్ విద్య, నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమలకు అనుగుణమైన కోర్సుల అమలు దిశగా ప్రభుత్వం ముందుకెళ్తోందని తెలిపారు. నారా లోకేష్ విద్యార్థులకు మంత్రి మాత్రమే కాదు… ఒక అన్నలా అండగా నిలుస్తున్నారని, విద్యారంగాన్ని బలోపేతం చేయడమే ఈ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని షాప్ చైర్మన్ ఏ. రవి నాయుడు స్పష్టం చేశారు.

Leave a Reply