students | విద్యార్థులకు ట్రాక్ సూట్స్ అందజేత…

students | విద్యార్థులకు ట్రాక్ సూట్స్ అందజేత…
- రూ.1.42 లక్షల రేణి ఫౌండేషన్ విరాళం
students | జన్నారం, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కలమడుగు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని 6 నుంచి టెన్త్ వరకు ఉన్న 262 మంది ఇంగ్లీష్, తెలుగు మీడియం విద్యార్థులకు ట్రాక్ సూట్లను విరాళంగా అందజేశారు. మంగళవారం సాయంత్రం ఆ పాఠశాల ఆవరణలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రేణి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఎన్నారై రేణికుంట్ల ప్రవీణ్ కుమార్, డైరెక్టర్, అదే పాఠశాల ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంటు టీచర్ రేణికుంట్ల కవిత ఆ ట్రాక్ సూట్లను విద్యార్థులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, తమ తల్లి స్వర్గీయ రేణికుంట్ల శారద పేరుపై రేణి ఫౌండేషన్ ను తమ తమ్ముడు ఎన్నారై రేణికుంట్ల నవీన్ కుమార్ ఏర్పాటు చేశారన్నారు. తమ తల్లి ఆశయ సాధన కోసం తనతో పాటు తమ్ముడు పేదలకు సేవ చేయాలనే సదుద్దేశంతో సేవా కార్యక్రమాలు ఆ పౌండేషన్ ద్వారా నిర్వహిస్తున్నామని ఆమె చెప్పారు. గతంలోనూ ఇదే పాఠశాలకు రూ.20వేలతో కంప్యూటర్ ప్రింటర్, సౌండ్ సిస్టంను విరాళంగా అందజేశామని ఆమె తెలిపారు.
ఈ సందర్భంగా రేణి ఫౌండేషన్ ను జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య, ఎంఈఓ విజయ్ కుమార్, హెచ్ఎం అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆ పాఠశాల హెచ్ఎం కట్ట రాజమౌళి, గ్రామ సర్పంచి బొంతల నాగమణి – మల్లేష్, ఉప సర్పంచి లింగన్న, పాఠశాల కమిటి చైర్మన్ సునీత, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
