Students | క్రీడారంగంలో రాణించాలి

Students | క్రీడారంగంలో రాణించాలి

  • యువత, విద్యార్థులు ఆట‌ల‌పై ఆస‌క్తి పెంచుకోవాలి

Students | ఊట్కూర్, ఆంధ్రప్రభ : యువత, విద్యార్థులు చదువుతోపాటు క్రీడారంగంలో రాణించాలని మొగ్ధంపూర్ సర్పంచ్ తిరుమలేష్ అన్నారు. బుధవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని మొగ్దుంపూర్‌లో సంక్రాంతి పర్వదినం పురస్కరించుకొని వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలను ప్రోత్సహించేందుకు ముగ్గుల పోటీలు యువతకు వాలీబాల్ పోటీలు నిర్వహించామని క్రీడా స్ఫూర్తి చాటేందుకు కృషి చేయాలన్నారు. క్రీడలతో మానసికోల్లాసంతో పాటు స్నేహభావం పెంపొందుతుందన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, ఉత్తేజాన్ని ఇస్తాయని, ప్రతీ ఒక్కరు ఆట‌లు ఆడటం వల్ల ఆరోగ్యం బాగుపడుతుందన్నారు. క్రీడాకారులు తమ నైపుణ్యాలను మెలకువలను ప్రదర్శించి ఉత్తమాట ప్రదర్శించాలని, గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని కోరారు. గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply