strict measures | ప్రశాంత ఎన్నికలకు పోలీసుల పహారా

strict measures | ప్రశాంత ఎన్నికలకు పోలీసుల పహారా

  • ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించుకోండి
  • ప్రలోభాలకు పాల్పడితే కఠిన చర్యలు, కేసులు నమోదు చేస్తాం
  • నందిగామ సర్కిల్ ఇన్ స్పెక్టర్ ప్రసాద్

strict measures | నందిగామ, ఆంధ్రప్రభ : స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, నందిగామ మండలంలో ఓటర్లు ఎలాంటి భయాందోళనలు, ఒత్తిళ్లు లేకుండా తమ ఓటు హక్కును(right to vote) ప్రశాంత వాతావరణంలో వినియోగించుకోవాలని నందిగామ ఇన్ స్పెక్టర్ పి.ప్రసాద్ ఆయా గ్రామ పంచాయతీల ఓటర్లకు గట్టి పిలుపునిచ్చారు.

ఓటు వజ్రాయుధం..

“ఓటు కేవలం హక్కు మాత్రమే కాదు, అది మన భవిష్యత్తును నిర్ణయించే వజ్రాయుధం” అని ఇన్ స్పెక్టర్(Inspector) అభివర్ణించారు. ప్రతిఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలని ఆయన కోరారు.

ప్రలోభాలపై ఉక్కుపాదం..

అమాయక ఓటర్లను టార్గెట్(target) చేస్తూ ప్రలోభాలకు గురిచేయడం, డబ్బు లేదా మద్యం పంపిణీలకు పాల్పడడం, లేదా గుంపులుగా ఏర్పడి ఉద్రిక్తతలు సృష్టించే చర్యలకు ఎవరు పాల్పడినా సహించేది లేదని ఇన్ స్పెక్టర్ ప్రసాద్ హెచ్చరించారు.

అలాంటి ఘటనలు తమ దృష్టికి వస్తే, తక్షణమే సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేసి, చట్టం ప్రకారం కఠిన చర్యలు(strict measures) తీసుకుంటామని స్పష్టం చేశారు. ఓటర్లు నిర్భయంగా ఉండాలని, ఎటువంటి అక్రమ కార్యకలాపాలు జరిగినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply