గ్యాస్ అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు : ఎస్సై గంగన్న

లింగాపూర్, ఆంధ్రప్రభ ; ఎల్పీజీ గ్యాస్ అధిక ధరలకు బ్లాక్ లో విక్రయిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని లింగాపూర్ ఎస్ఐ గంగన్న అన్నారు. ఆయన ఆదివారం మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. గ్యాస్ సరఫరా తగినంత ఉందని ఎవరు కూడ అపోహలు నమ్మవద్దని ప్రజలను కోరారు.

ఇటీవల గృహ వినియోగం కోసం ఎల్పీజీ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు అక్రమంగా వినియోగించడం,నిల్వ చేయడం,బ్లాక్ మార్కెటింగ్ చేయడం వంటి చర్యలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఎవరైనా గ్యాస్ బ్లాక్ లో అమ్మితే పోలీస్ సమాచార ఇవ్వాలని ఆయన ప్రజలను కోరారు

Leave a Reply