మెడికల్ వ్యాపారులు సేవా దృక్పథంతో పని చేయాలి…

మెడికల్ వ్యాపారులు సేవా దృక్పథంతో పని చేయాలి…

  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా
  • దేశవ్యాప్తంగా 10,000 స్టోర్స్ ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పనిచేస్తాం…
  • ⁠జెనివిస్ రెమెడీస్ ఫౌండర్ సి ఈ ఓ సంతోష్ షెడ్జి

కేదారేశ్వరపేట, ఆంధ్రప్రభ : సామాన్య ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను, మందులను అందుబాటులోకి తీసుకురావాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశయాలకు అనుగుణంగా మెడికల్ వ్యాపారులు సేవా దృక్పథంతో పని చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా సూచించారు. జనరిక్ మెడిసిన్ అందరికీ అందుబాటులో ఉంటాయని ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. గవర్నర్ పేట ఆంధ్రరత్న భవన్ సమీపంలోని ఒక హోటల్లో జెనివిస్ రెమెడీస్ జనరిక్ మెడిసిన్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది .

ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తో కలిసి జెవినిస్ రెమెడీస్ జనరిక్ మెడిసిన్ ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం పీఎం జన ఔషధీ యోజన ప్రారంభించి, పేద ప్రజలపై వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించిందన్నారు. జనరిక్ మెడిసిన్ అందరికీ అందుబాటులో ఉంటాయని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.

అనంతరం జెనివిస్ రెమెడీస్ ఫౌండర్ సి ఈ ఓ సంతోష్ షెడ్జి మాట్లాడుతూ 2016 వ సంవత్సరంలో పూణే లో జెనివిస్ రెమెడీస్ ప్రారంభించామని దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో తమ కు వేలాది స్టోర్స్ ఉన్నాయని అన్నారు. సాధారణంగా మార్కెట్ లో లభించే మందుల ధరలతో పోల్చితే తమ స్టోర్స్ లో 30 నుంచి 80 శాతం డిస్కౌంట్ తో మందులు అందిస్తున్నట్లు తెలిపారు. పేద ప్రజల కుటుంబాలపై వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

ఆంద్ర రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1000 ప్రాంచైజీలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. అనంతరం జెనివిస్ ఆంధ్రా హెడ్ కడపకు చెందిన పి. శివకుమార్ మాట్లాడుతూ, మందుల ధరలు సామాన్యులకు భారంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో, తమ సంస్థ విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోందని తెలిపారు. బయట మార్కెట్‌లో 5,000 రూపాయలు పలికే మందులను, అదే క్వాలిటీ, అదే సాల్ట్ కంపోజిషన్‌తో కేవలం 800 నుండి 900 రూపాయలకే అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

తాము సరఫరా చేసే ప్రతి మందు డబ్ల్యూహెచ్ ఓ , జిఎంపి సర్టిఫికేషన్ పొందిన అత్యంత నాణ్యమైన డ్రగ్స్ అని ఆయన స్పష్టం చేశారు. 2027 మార్చి 31 నాటికి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 1,000 స్టోర్లను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు శివకుమార్ వెల్లడించారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లో రీజినల్ హెడ్స్, జోనల్ హెడ్స్ , డిస్ట్రిక్ట్ హెడ్స్‌తో కూడిన బలమైన నెట్‌వర్క్‌ను ఇప్పటికే సిద్ధం చేశామన్నారు.

కేవలం 6 నుండి 7 లక్షల రూపాయల పెట్టుబడితో (మందులతో కలిపి) ఫ్రాంచైజీ పొందే అవకాశం కల్పిస్తున్నామని, ఆసక్తి గలవారు తమను సంప్రదించాలని ఆయన కోరారు. తక్కువ ధరకే మందులను అందిస్తూ ప్రజలకు సేవ చేయాలనే ఈ గొప్ప సంకల్పంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జెనివిస్ రెమెడీస్ నేషనల్ హెడ్ వివేక్, తెలంగాణ హెడ్ కిషోర్, కర్ణాటక హెడ్ కిషోర్, జోనల్ హెడ్స్ భాగ్యలక్ష్మి, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply