Stock Market | నాలుగో రోజూ ‘బేర్’ మన్న మదుపర్లు .. ….

24 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
117 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
6 శాతానికి పైగా నష్టపోయిన మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు

ముంబయి – దేశీయ స్టాక్ మార్కెట్‌లో ఒడిదుడుకులు కొనసాగుతూనే ఉన్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు నష్టాల్లో ముగిశాయి. ఆటో స్టాక్స్ లో అమ్మకాల ఒత్తిడి సూచీలపై ప్రభావాన్ని చూపింది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు కూడా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో మిశ్రమ సంకేతాలు కారణంగా శుక్రవారం ఉదయం ప్లాట్‌గా ప్రారంభమైన సూచీలు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. ఇక ముగింపులో భారీ నష్టాలతో ముగిసింది. ట్రంప్ నిర్ణయాలు కారణంగా ఈ వారం లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. సెన్సెక్స్ 424 పాయింట్లు నష్టపోయి 75, 311 దగ్గర ముగియగా.. నిఫ్టీ 117 పాయింట్లు నష్టపోయి 22, 795 దగ్గర ముగిసింది. నిఫ్టీ మెటల్ మాత్రమే 1 శాతానికి పైగా లాభపడింది. ఎలక్ట్రిక్ వాహనాలపై దిగుమతి సుంకాన్ని 110 శాతం నుంచి 15 శాతానికి తగ్గించే అవకాశం ఉందనే నివేదికల మధ్య నిఫ్టీ ఆటో 2.5 శాతం పడిపోయింది. ఇక అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ మరో 7 పైసలు బలహీనపడి రూ. 86.71గా ఉంది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా స్టీల్ (1.88%), ఎల్ అండ్ టీ (1.10%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (0.75%), ఏషియన్ పెయింట్స్ (0.35%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (0.31%).

టాప్ లూజర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (-6.07%), అదానీ పోర్ట్స్ (-2.57%), టాటా మోటార్స్ (-2.46%), సన్ ఫార్మా (-1.60%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-1.52%).

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *