Stock Market | నేడు కూడా రూ నాలుగు ల‌క్ష‌ల కోట్ల సంప‌ద ఆవిరి

ముంబై – దేశీయ స్టాక్ మార్కెట్లలో వారాంతంలో మొదటిరోజైన నేడు బేర్ హావా కొనసాగింది. ఈ క్రమంలో వరుసగా ఐదో రోజు కూడా స్టాక్ మార్కెట్‌లో న‌ష్టాల బాట‌నే పయనించాయి. ఈ క్రమంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 856.65 పాయింట్లు పడిపోయి 74,454.41 స్థాయికి చేరుకోగా, నిఫ్టీ 50 కూడా 242.55 పాయింట్లు తగ్గి 22,553.35 వద్ద ముగిసింది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ 329 పాయింట్లు పడిపోయి 48,651 స్థాయిలో ఉండగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీ 473 పాయింట్లు దిగజారింది.

ఈ క్రమంలో ఐదో సెషన్‌లో సెన్సెక్స్, నిఫ్టీ పతనమవడంతో పెట్టుబడిదారులు రూ. 402.20 లక్షల కోట్లు నష్టపోయారు. ఈ నెల‌ 21న బీఎస్‌ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ. 402 లక్షల కోట్లుగా ఉండగా, ప్రస్తుత సెషన్‌లో పెట్టుబడిదారుల సంపద రూ. 397.90 లక్షల కోట్లకు చేరుకుంది. ఈ క్రమంలో ఇన్వెస్టర్లు దాదాపు రూ. 4.38 లక్షల కోట్లు కోల్పోయారు. ఈ క్రమంలో నిఫ్టీ 50, సెన్సెక్స్ దాదాపు 4 శాతం పడిపోయాయి. సెప్టెంబర్ 27, 2024 గరిష్ట స్థాయి తర్వాత నిఫ్టీ 13.8 శాతం, సెన్సెక్స్ 12.98 శాతం తగ్గిపోవడం విశేషం.

ఈ క్రమంలో విప్రో, హెసిఎల్ టెక్, టిసిఎస్ , ఇన్ఫోసిస్, భారతి ఎయిర్‌టెల్ కంపెనీల స్టాక్స్ టాప్ 5 నష్టాల్లో ఉండగా, ఎం అండ్ ఎం, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఐచర్ మోటార్స్, హీరో మోటోకార్ప్, కోటక్ మహీంద్రా సంస్థల లాభాలు గడించాయి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *