ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు..

ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు..

నిజాంపేట, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని చల్మెడ గ్రామంలో ఈ రోజు లీ ఫామ్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్(Lee Farm Resources Pvt) ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ విత్తనాలు నాటే కార్యక్రమం నర్సరీలో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా ఉద్యానవన అధికారి ప్రతాప్ సింగ్, జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్(Dev Kumar) హాజరయ్యారు. ఆయిల్ ఫామ్ సాగుతో అధిక ఆదాయం పొందవచ్చు అన్నారు.

సాంప్రదాయ పంటలకు స్వస్తి చెబుతూ రైతులు ఈ దిశగా ఆలోచించాలని వారు సూచించారు. ఆయిల్ ఫామ్ పంట కొనుగోలు విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని ఆ కంపెనీ డైరెక్టర్ రంగనాయకులు(Ranganayakulu) తెలిపారు. ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ ఆఫీసర్ రచన, ఏడిఏ వినయ్ కుమార్, రాజు నారాయణ, లీవ్ ఫామ్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ డిప్యూటీ మేనేజర్ ప్రశాంత్, ఏవో సోమలింగారెడ్డి(AO Somalingareddy), ఏఈఓలు శ్రీలత, మౌనిక, రమ్య, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply