గ్యాస్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలి

మంథని, ఆంధ్రప్రభ : సామాన్యుడికి గ్యాస్ సరఫరా ఆకు అంతరాయం కలగకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎరుకల ప్రవీణ్ శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలపై గ్యాస్ ధరలు పెంచి భారం వేయడం సరైనది కాదని పేర్కొన్నారు.

పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఎల్పిజి గ్యాస్ తరపరాలు ఎలాంటి అంతరాయం లేకుండా వినియోగదారులకు అందించాలని పేర్కొన్నారు. పట్టణాలలో 20 నుంచి 25 రోజుల వ్యవధి, గ్రామాలలో 45 రోజులకు పెంచడం సామాన్యులకు ఇబ్బందిగా మారుతుందని దీనిపైన కేంద్ర ప్రభుత్వం పునఃరాలోచన చేయాలని తెలిపారు.

Leave a Reply