మొంథా తుఫాను ప్రభావంతో…
హుజూర్ నగర్, ఆంధ్రప్రభ : మొంథా తుఫాను ప్రభావంతో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఐ చరమందరాజు (CI Charamandaraju) తెలిపారు. తుఫాను ప్రభావం తీవ్రంగా ఉందని అత్యవసరమైతేనే బయటకు రావాలని చెట్లకింద, కరెంటు స్తంభాల కింద ఉండరాదన్నారు.
నది తీర ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. చెరువులు, కాలువ వద్ద ఎలాంటి అసాధారణ పరిస్థితి ఉన్నా డయల్ 100 కు సమాచారం ఇవ్వాలని కోరారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లకు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని, తడి చేతులతో కరెంట్ వస్తువులను తాకరాదని తెలిపారు. పోలీస్, ప్రభుత్వ అధికారుల సూచనలు పాటించి ప్రజలు సురక్షితంగా ఉండాలని అన్నారు.

