కర్నూలులో రాష్ట్ర టోర్నీ షురూ

కర్నూలు, ఆంధ్రప్రభ బ్యూరో : కర్నూలు నగర శివారులోని స్థానిక ఆదర్శ విద్యా మందిర్ ప్లే గ్రౌండ్లో(Vidya Mandir play ground) రాష్ట్రస్థాయి జూనియర్ బాలబాలికల షూటింగ్ బాల్(shooting ball) ఛాంపియన్ షిప్ టోర్న‌మెంట్స్(tournaments) గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మాజీ ఎంపీ టీజీ.వెంకటేష్(MP TG.Venkatesh) పోటీలను లాంఛనంగా ప్రారంభించి అనంతరం మాట్లాడారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన క్రీడాంశాల్లో సులభంగా పథకాలు సాధించే అంశాలను ఎంచుకొని పోటీ(Competition) ప్రపంచంలో రాణించాలని ఆయన క్రీడాకారులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం కల్పిస్తున్నస్పోర్ట్స్(Sports) కావటంతో వినియోగించుకునేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు క్రీడాకారులను ప్రోత్సహించాలన్నారు. ఇంత పెద్ద ఎత్తున పోటీలు నిర్వ‌హించేందుకు పూనుకున్నరాష్ట్ర షూటింగ్ బాల్ అసోసియేషన్(State Shooting Ball Association) నిర్వాహకులను ఆయన కొనియాడారు. ప్రభుత్వ ప్రోత్సాహం లేకుండా ప్రైవేటుగా పోటీలు నిర్వహించడం ఆషామాషీ విషయం కాదని ఆయన తెలిపారు.


కార్యక్రమంలో కేవీ సుబ్బారెడ్డి(KV Subbareddy) విద్యాసంస్థల అధినేత కేవీ సుబ్బారెడ్డి, ఆదర్శ విద్యాసంస్థల డైరెక్టర్ బీ హరికిషన్, బనగానపల్లి నెహ్రూ స్కూల్ డైరెక్టర్ రవితేజ, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు రామాంజనేయులు, రాష్ట్ర షూటింగ్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పరుశరాముడు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.

Leave a Reply