
State President | ఆ.. బాధ్యత విద్యాశాఖ అధికారులదే..
State President | ఆ.. బాధ్యత విద్యాశాఖ అధికారులదే..
State President | విజయవాడ, కృష్ణలంక, ఆంధ్ర ప్రభ : ఎన్టీఆర్ జిల్లాలో ఏకోపాధ్యాయులు ఐచ్చిక సెలవులు వినియోగించుకోవడానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు మండల విద్యాశాఖ అధికారులే చేసుకోవాలని డెమొక్రటిక్ పిఆర్టియు, ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ డి. శ్రీను అన్నారు. మంగళవారం ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్ చంద్రకళను కార్యాలయంలో కలిసి వినతి పత్రం ద్వారా విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు డా. డి.శ్రీను మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం 10వ తరగతి విద్యార్థులకు విద్యాశాఖ పక్షాన అందజేసే స్ఫూర్తి మెటీరియల్ ని ముందుగానే ఇవ్వాలని అదే విధంగా సాయంత్రం పూట పదో తరగతి విద్యార్థులకు అల్పాహారం ఏర్పాటు చేసే విధంగా జిల్లా కలెక్టర్ తో మాట్లాడాలని కోరామన్నారు. దీని పై జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్ చంద్రకళ సానుకూలంగా స్పందించారు. ఉపాధ్యాయులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. స్ఫూర్తి స్టడీ మెటీరియల సాయంకాలపు అల్పాహారం సకాలంలో ఇవ్వడానికి చర్యలు చేపట్టామని తెలియజేసినందుకు డెమొక్రటిక్ పిఆర్టియు పక్షాన కృతజ్ఞతలు తెలియజేశామన్నారు.
