Chennur : అన్నిరంగాల అభివృద్దే లక్ష్యం..

Chennur : అన్నిరంగాల అభివృద్దే లక్ష్యం..
మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి
చెన్నూర్, ఆంధప్రభ : రాష్ట్రంలోని అన్నిరంగాల అభివృద్దే కాంగ్రెస్ లక్ష్యమని రాష్ట్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి (Gaddam Vivek Venkataswamy) అన్నారు. తను ప్రతినిధ్యం వహిస్తున్న మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను బుధవారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ (Kumar Deepak) తో కలిసి ప్రారంభించారు.
జైపూర్ (Jaipur) మండల కేంద్రంలో నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల జూనియర్ కళాశాల నూతన భవనం ప్రారంభం, భీమారం (Bhimaram) మండలంలోని గొల్లవాగు ప్రాజెక్ట్ లో మత్సశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత చేపపిల్లలను వదిలారు. అనంతరం కోటపెల్లి మండలం దేవులవాడ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని మంత్రి ప్రారభించారు.
వేరువేరుగా జరిగిన ఈ కార్యక్రమాలలో మంత్రి మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) అన్నివర్గాల ప్రజల సంక్షేమంతో పాటు విద్య, వైద్య రంగానికి పెద్ద పీట వేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వివిధశాఖల అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
