ప్రభుత్వ సంక్షేమ పథకాలే

ప్రభుత్వ సంక్షేమ పథకాలే

  • టౌన్ కాంగ్రెస్ ప్రసిడెంట్ ముచర్ల మల్లయ్య

బెల్లంపల్లి,ఫిబ్రవరి5(ఆంధ్రప్రభ): రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కొరకు అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలే బెల్లంపల్లి మున్సిపాలిటీలో పదో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి దీకొండ పద్మను గెలిపిస్తాయని టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ముచ్చర్ల మల్లయ్య తెలిపారు. గురువారం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 10 వ వార్డులో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పేదలకు విందుల మైండ్లు మహిళలకు మహాలక్ష్మి గృహజ్యోతి తదితర సంక్షేమపథకాలుఅమలుపరుస్తూ ప్రజల్లోకాంగ్రెస్ పార్టీ చెరగని ముద్ర వేసుకుందన్నారు. ప్రజలంతా కాంగ్రెస్ ప్రభుత్వం పై చూస్తున్నారని తెలిపారు.10వ వార్డు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ అభ్యర్థి డికొండ పద్మకు ప్రజలు అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో బెల్లంపల్లి మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కావ్య సంఘం చేసుకుంటుందని టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న కుట్రలు కుతంత్రాలను ప్రజలు తిప్పి కొట్టాలన్నారు.

ఈ ర్యాలీలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండి నయీమ్, సీనియర్ నాయకులు డీకొండ రాజలింగు టౌన్ యూయూత్ అధ్యక్షుడు చొప్పరి శ్రీకాంత్, కె కిరణ్, తాటికొండ రాజగోపాల్, లింగాల రాజశేఖర్, బొజ్జబాణయ్య, పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు

Leave a Reply