న్యూఢిల్లీ-ఆంధ్రప్రభ ప్రతినిధి : జీఎస్టీ (GST) రేట్ల హేతుబద్ధీకరణపై కీలక చర్చలకు ఢిల్లీలో ఎన్డీఏ యేతర పాలిత రాష్ట్రాల ఆర్థిక మంత్రులు (FinanceMinisters) సమావేశమయ్యారు. కొద్దిసేపటి క్రితమే ఢిల్లీలో ఈ సమావేశం ప్రారంభమైంది.

కర్ణాటక ముఖ్యమంత్రి (Karnataka CM) సిద్ధరామయ్య ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. కర్ణాటక, తెలంగాణ, కేరళ, తమిళనాడు, పంజాబ్, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు పాలుపంచుకున్నారు. తెలంగాణ (Telangana) రాష్ట్రం నుంచి డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక మంత్రులు మాట్లాడుతూ… ప్రస్తుత జీఎస్టీ రేట్ల వ్యవస్థ వల్ల రాష్ట్రాలకు ఆర్థిక భారం పెరుగుతోందని, ప్రజలపై కూడా అధిక పన్నుల భారం (High tax burden) పడుతోందని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా అవసరమైన వస్తువులపై జీఎస్టీ తగ్గించి, విలాస వస్తువులపై పెంచాలని ఈ సమావేశంలో ప్రతిపాదనలు వచ్చినట్లు సమాచారం.

Leave a Reply