STATE | మంత్రి సహకారంతో అభివృద్ధి
- పన్నుర్ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా..
- కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిందం మహేశ్
STATE | రామగిరి, ఆంధ్రప్రభ : రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సహకారంతో పన్నూరు గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని సర్పంచ్ అభ్యర్థి చిందం మహేశ్ తెలిపారు. రానున్న సర్పంచ్ ఎన్నికల్లో (Election) కత్తెర గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరుతున్నారు. పన్నుర్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని, గ్రామాభివృద్ధి, ప్రజల సంక్షేమం, పారదర్శక పాలనను లక్ష్యంగా పెట్టుకున్న రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు సహాకారంతో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానన్నారు.
గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో నడపడం తన ధ్యేయమని, తాగునీటి (Water) సమస్యలు పరిష్కారం, రహదారుల అభివృద్ధి, వీధి దీపాల ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. గ్రామ యువత అభివృద్ధి, మహిళా సాధికారత, రైతుల సంక్షేమం, విద్యా – ఆరోగ్య రంగాల్లో నాణ్యత పెంపుపై ప్రత్యేక దృష్టి సారిస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్రామాన్ని అభివృద్ధి దిశగా పయనించేలా పెద్ద ఎత్తున నిధులు కె టాయించేలా చూస్తానన్నారు. చిందం మహేశ్ ను సర్పంచ్ అభ్యర్థిగా బలపరిచినట్లు పార్టీ స్థానిక నాయకులు తెలిపారు. ప్రచారంలో గ్రామంలోని అన్ని వర్గాల ప్రజలు, యువత, మహిళా సంఘాలు, రైతులు, కాంగ్రెస్ కార్యకర్తలు మద్దతుగా నిలుస్తున్నారు.

