Stadium | ఇంట‌ర్నేష‌న‌ల్ స్టాండ‌ర్డ్స్ తో స్డేడియం అభివృద్ధి..

Stadium | ఇంట‌ర్నేష‌న‌ల్ స్టాండ‌ర్డ్స్ తో స్డేడియం అభివృద్ధి..

  • క్రీడాకారులకు అవసరమైన అన్ని వసతులు ఏర్పాటు..
  • యుద్ధ ప్రాతిపదికన పనులు…
  • నైపుణ్య క్రీడాకారులకు ప్రోత్సాహకాలు..
  • ఏసీఏ అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని…

Stadium | ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఉండే విధంగా అన్ని మౌలిక సదుపాయాలతో తీర్చిదిద్దన ఉన్నట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేసినేని శివనాద్ పేర్కొన్నారు.

క్రీడాకారులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తామన్నారు. నైపుణ్యం ప్రదర్శించిన క్రీడాకారులకు ప్రోత్సాహాలు సైతం అందించనున్నట్లు తెలిపారు. ఇందిరాగాంధీ స్టేడియం అభివృద్ధి పునరుద్ధరణకు సంబంధించి శాప్ చైర్మ‌న్ అనిమిని రవినాయుడు ఆధ్వ‌ర్యంలో జరిగిన ఈ స‌మావేశంలో ఎంపీ కేశినేని శివ‌నాథ్, శాప్ ఎమ్.డి భరణి తో పాటు శాప్ , డైరెక్టర్లు, అధికారులు, ఆర్కిటెక్చర్లు పాల్గొన్నారు.

విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, పటమటలోని చెన్నుపాటి రామకోటయ్య మున్సిపల్ ఇండోర్ స్టేడియం, బందర్ రోడ్ లోని దండమూడి రాజగోపాలరావు ఇండోర్ స్టేడియం, పశ్చిమ నియోజకవర్గం విద్యాధర పురం మున్సిపల్ క్రీడా ప్రాంగణాలను పూర్తిగా ప‌రిశీలించిన‌ట్లు ఆర్కిటెక్చ‌ర్లు తెలిపారు.

అలాగే ఇందిరా గాంధీ మున్సిప‌ల్ స్టేడియం పునరుద్ధరణకు సంబంధించిన న‌మూనా చిత్రాల‌ను ప్ర‌దర్శించి వివ‌రాలు తెలియ‌జేశారు. ఎంపీ కేశినేని శివ‌నాథ్, శాప్ చైర్మ‌న్ అనిమిని ర‌వి నాయుడు దానికి సంబంధించి ప‌లు స‌ల‌హాలు, సూచ‌న‌లు చేయ‌టంతో పాటు కొన్ని మార్పులు చేయాల్సిందిగా సూచించారు.

ఇందిరా గాంధీ స్టేడియానికి సంబంధించి అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఆధునిక సదుపాయాల ఏర్పాటు, క్రీడాకారులకు అవసరమైన వసతుల విస్తరణ, స్థానిక క్రీడా కార్యకలాపాల ప్రోత్సాహం వంటి అంశాలపై ప్రత్యేకంగా చర్చించారు. ఈ స‌మావేశంలో న‌గ‌రంలోని స్టేడియాల‌ను అభివృద్ధి చేసేందుకు ప‌నులు యుద్ద‌ప్రాతిప‌దిక‌న చేప‌ట్టాల‌ని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. అలాగే ఈ స్టేడియాల అభివృద్దికి సంబంధించిన‌ స‌మ‌గ్ర నివేదిక‌లు త్వ‌రిత‌గ‌తిన‌ స‌మ‌ర్పించాల‌న్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో శాప్ డైరెక్ట‌ర్ సంతోష్ కుమార్, అడ్మిస్ట్రేటివ్ ఆఫీసర్ రమావత్ నాయక్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మునిశేఖర్, డి.ఎస్.డి.వో కాకర్ల కోటేశ్వరరావు, ఆర్కిటెక్చర్లు వడ్లమూడి శ్రీ హర్ష, రామ్ కిరణ్ లతోపాటు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply