శ్రీసత్యసాయి జిల్లాలో విషాదం
అమడగూరు (శ్రీ సత్యసాయి జిల్లా) ఆంధ్రప్రభ : శ్రీసత్యసాయి జిల్లా అమడగూరు(Amadaguru) మండల పరిధిలోని ఏ. కొత్తపల్లిలో(A. In Kothapally) మిద్దె గోడ కూలీ వెంకటరమణ(Venkataramana) (70) అనే వృద్ధుడు మృతి చెందాడు.
కుటుంబ సభ్యుల సమాచారం మేరకు కొత్తపల్లిలో వెంకటరమణ బంధువులు ఇల్లు పడగొడుతుండగా గోడ వృద్ధుడి మీద పడింది. కాలు విరిగి వెన్నుపూస తీవ్రంగా దెబ్బతింది. చికిత్స కోసం కదిరికి కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు(doctors) మెరుగైన చికిత్స కోసం అనంతపురం ఆసుపత్రికి సిఫార్సు చేయగా.. అక్కడకు చేరే సరికి వెంకట రమణ మృతి చెందాడు.