Srisailam | బ్రహ్మోత్సవాలకు…

Srisailam | బ్రహ్మోత్సవాలకు…

Srisailam | వెబ్ డెస్క్, ఆంధ్ర‌ప్ర‌భ : శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలపై మంత్రులు ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి, అనిత, బీసీ జనార్దన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈనెల 14, 15, 16 తేదీల్లో జరిగే బ్రహ్మోత్సవాలకు 50శాతం భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందని మంత్రి ఆనం పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల నుంచి ఎలాంటి రుసుం తీసుకోకుండా భక్తుల వాహనాలు అనుమతించాలన్నారు.

సామాన్య భక్తులకు ప్రాధాన్యత, సౌకర్యాలు మెరుగ్గా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని తెలిపారు. దోర్నాల – ఆత్మకూరు రహదారి మరమ్మతులు పూర్తి చేయాలని మంత్రి జనార్ధ‌న్ రెడ్డి అధికారులని ఆదేశించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్, భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు హోంమంత్రి అనిత వెల్లడించారు.

Leave a Reply