srikakulam Mother Suicide : ఓ తల్లి క్షణావేశం Andhra Prabha News

srikakulam Mother Suicide : ఓ తల్లి క్షణావేశం Andhra Prabha News
- ఇద్దరు కొడుకులు సహా ఆత్మహత్యకు యత్నం
- తల్లి మృతి.. బిడ్డలిద్దరూ వికలాంగులు
- శ్రీకాకుళం జిల్లాలో విషాదం
( జలుమూరు(పోలాకి), ఆంధ్రప్రభ ):
srikakulam Mother Suicide : కుటుంబ కలహాల కారణంగా ఒక తల్లి, తన ఇద్దరు కుమారులతో సహా రైలు కింద పడి ఆత్మహత్య ప్రయత్నించింది. ఈ ఘటనలో తల్లి మృతి చెందగా ఇద్దరు కుమారులు గాయాలతో శ్రీకాకుళం రిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. వివరాలలోకి వెళితే , శ్రీకాకుళం పట్టణానికి చెందిన కొత్తపల్లి జ్యోతి (35) ఓ వివాహిత. ఆమెకు ఇద్దరు కుమారు ఉన్నారు. పెద్ద కుమారుడు హేమంత్ ఏడవ తరగతి చదువుతున్నాడు. రెండవ కుమారుడు పునీత్ రెండవ తరగతి చదువుతున్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆమె మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో తన కుమారులతో కలిసి శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం తిలారు – ఉర్లాం రైల్వే స్టేషన్ మధ్య కంబకాయ రైల్గట్ దగ్గరలో (బొంతలకోడూరు) రైల్వే పట్టాలకు చేరుకుంది. రైలు కింద పడి ఆత్మహత్య ప్రయత్నించింది. ఇద్దరు పిల్లలు రైలు కింద పడకుండా తప్పించుకున్నారు. కానీ ఇద్దరిలో ఓ బాలుడి ఎడమ కాలు, ఇంకో బాలుడి కుడికాలు పాదం వద్ద తెగిపోయాయి. వెంటనే విశాఖ ఎక్స్ ప్రెస్ డ్రైవర్ రైలు ఆపి ఇద్దరు పిల్లల్ని శ్రీకాకుళం రైల్వే స్టేషన్ కి తరలించారు. గాయపడిన ఇద్దరు పిల్లన్ని రిమ్స్ ఆస్పత్రిలో చేర్చినట్లు జీఆర్బీ పోలీసులు తెలిపారు. .రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు
