Srikakulam | వైభవంగా ఆదిత్యుని కళ్యాణం

Srikakulam | వైభవంగా ఆదిత్యుని కళ్యాణం
Srikakulam | శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : ఉష, పద్మిని, ఛాయ సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి కళ్యాణం ఇవాళ జరిపారు. పుష్య బహుళ ఏకాదశిని పురస్కరించుకొని స్వామి వారికి కళ్యాణం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ, ఆలయ కార్యనిర్వాహణాధికారి ప్రసాద్ తెలిపారు. ఆలయ అర్చకులు సందీప్ శర్మ, వేద పండితులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి వారి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో కళ్యాణ ఉత్సవం తిలకించారు.
