కన్నుల పండుగగా శ్రీ సీతారాముల కళ్యాణం

గట్టుప్పల, ఆంధ్రప్రభ : మండలంలోని శేర్ గూడెం గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా ఈరోజు జరిగింది.కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి శాసనమండలి సభ్యులు నెల్లికంటి సత్యం హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అంతకుముందు గ్రామ పుర వీధులలో డప్పు చప్పులతో స్వామివార్లను ఊరేగింపు నిర్వహించి దేవాలయ ప్రాంగణంలో అందంగా అలంకరించిన కళ్యాణ మండపంలో అర్చకులు కళ్యాణ క్రతువును జరిపించారు. కమనీయ కళ్యాణానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్ధ ప్రసాదాలను, అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ పంకర్ల ప్రభాకర్,ఉప సర్పంచ్ ముడిగే అరుణ మురళి, పనికెర్ల నరసింహ,గొడ్డటి సురేష్,గొడ్డటి శ్రీనివాస్,పనికెర్ల నారాయణ,సిపిఐ మండల కార్యదర్శి బీమనపల్లి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
