బెల్లంపల్లి లో కన్నుల పండువగా శ్రీరామ నవమి వేడుకలు

బెల్లంపల్లి లో కన్నుల పండువగా శ్రీరామ నవమి వేడుకలు
వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గడ్డం వినోద్ -రమ దంపతులు
మున్సిపల్ ఛైర్పర్శన్ దావ స్వాతి రమేష్ దంపతులు
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి పట్టణంలో శుక్రవారం శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని కోదండ రామాలయంలో నిర్వహించిన సీతారాముల కల్యాణ మహోత్సవానికి ఎమ్మెల్యే గడ్డం వినోద్-రమ మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి రమేష్ బాబు, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ మునిమందస్వరూప రమేష్, ఆలయ కమిటీ చైర్మన్ బండి రాము దంపతులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులు రాములవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.ఈ వేడుకలకు మాజీ మున్సిపల్ చైర్మన్ మత్తమారి సూరి బాబు,కోదండ రామాలయ కమిటీ చైర్మన్ బండి రాము బండి రజిత టీ పీ సీ సీ సభ్యుడు చిలుముల శంకర్,కౌన్సిలర్లు తాండ్ర స్రవంతి,తిరుమల వాసు,మాజీ కౌన్సిలర్ బండి ప్రభాకర్ యాదవ్, ఆలయ కమిటీ డైరెక్టర్లు నక్క కృష్ణ, రేణికుంట్ల శ్రీనివాస్, రాచకొండ గోవర్ధన్ రావు, మత్తమారి విజయలక్ష్మి, మోటూరు కుమారస్వామి, లెక్కల వెంకటేష్, పరమేష్ లతోపాటు వేలాది మంది భక్తులు వేడుకల్లో పాల్గొన్నారు.
కాగా ఈ సందర్భంగా భక్తులకు మార్వాడి యువ మంచ్, తిలక్ వాకర్స్ అసోసియేషన్, ఆర్యవైశ్య సంఘం,ఆర్యవైశ్య యువజన సంఘం, సత్య సాయి సేవ సమితి,గౌసేఆజామ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎం డీ ముక్తార్ బాయ్ ల ఆధ్వర్యం లో మజ్జిగ, రస్న, అంబలి, కూల్ వాటర్, పంపిణీ చేశారు.
అంతే కాకుండా బజార్ ఏరియా లో మహాలక్ష్మి లేడీస్ ఎంపోరియం యాజమాని పసుపు లేటి రాధా భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బెల్లంపల్లి రూరల్ ఇన్స్పెక్టర్ హానూక్ ఆధ్వర్యం లో టూ టౌన్ ఎస్సై చిలుముల కిరణ్ కుమార్ రూరల్ తాళ్ల గురజాల ఎస్సై రామకృష్ణ, ఏ ఎస్సై బాబానా ఆధ్వర్యంలో గట్టి పోలీసు బందోబస్తు నిర్వహించారు
