సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ధేశించిన 191 పురుగుల ఛేదనలో లక్నో చెలరేగి ఆడుతొంది. ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లను ఉతికారేస్తూ.. 8.4 ఓవర్లలో 120 పరుగులు సాధించింది.
ఈక్రమంలో 26 బంతుల్లో 6 ఫోర్లు, 6సిక్సులతో 70 పరుగులు చేసి హైదరాబాద్ బౌలర్లను బెంబేలెత్తించిన నికోలస్ పూరన్ ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ గా ఔటయ్యాడు.
కాగా, ప్రస్తుతం క్రీజులో మిచెల్ మార్ష్ (37) కెప్టెన్ రిషబ్ పంత్ ఉన్నారు. లక్నో విజయానికి 66 బంతుల్లో 71 పరుగులు కావాల్సి ఉంది.