sreeleela | గుబులు పెట్టిస్తున్న తెలుగమ్మాయి

sreeleela | గుబులు పెట్టిస్తున్న తెలుగమ్మాయి
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : తెలుగు చిత్ర పరిశ్రమలోకి మెరుపుతీగలా దూసుకొచ్చి అతి తక్కువ సమయంలోనే అగ్ర హీరోల సరసన నటించే అవకాశం దక్కించుకుని ‘మోస్ట్ వాంటెడ్’ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది అచ్చ తెలుగమ్మాయి శ్రీలీల . దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు పర్యవేక్షణలో వచ్చిన ‘పెళ్లి సందD’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన శ్రీలీల, తన డ్యాన్సింగ్ స్కిల్స్, ఎనర్జీతో కుర్రకారును ఆకట్టుకుంది. ఆ తర్వాత రవితేజతో చేసిన ‘ధమాకా’ బ్లాక్‌బస్టర్ కావడంతో ఆమె దశ తిరిగింది. మహేశ్ బాబు, నందమూరి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో వరుస అవకాశాలు అందుకుంది.

























