SR BC | తల్లీబిడ్డల ఆత్మహత్యల కేసులో..

SR BC | తల్లీబిడ్డల ఆత్మహత్యల కేసులో..
- ముగ్గురు అరెస్ట్..
SR BC | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లా గడివేముల మండలంలో గత నాలుగు రోజుల క్రితం ఎస్ఆర్ బీసీ కాలువలో ఇద్దరు పిల్లలను తోసి తల్లి లక్ష్మి ఆత్మహత్య చేసుకున్న సంఘటన జరిగింది. ఈ సంఘటనపై మృతురాలు తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు సీఐ కిరణ్ కుమార్ రెడ్డి(CI Kiran Kumar Reddy) తెలిపారు.
ఆడపడుచులు, భర్త వేధింపుల కారణంతోనే ఈ లక్ష్మీ అనే మహిళ ఆత్మహత్య చేసుకున్నదని ఫిర్యాదు చేశారు. గుర్తురాలే భర్త రమణయ్య అత్త లాగ లచ్చమ్మ, ఆడపడుచు రామలక్ష్మీ అరెస్ట్ చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
