Sports | విభాగ్ స్థాయి ఖేల్ కూద్‌లో విద్యార్థుల ప్రతిభ….

Sports | విభాగ్ స్థాయి ఖేల్ కూద్‌లో విద్యార్థుల ప్రతిభ….

Sports | ఊట్కూర్, ఆంధ్రప్రభ : ఉమ్మడి పాలమూర్ కల్వకుర్తి కేంద్రంగా జరిగిన విభాగ్ ఖేల్ కూద్(Vibhag Khel Kood)లో నారాయణపేట, పాలమూర్, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాలో నుండి శ్రీ సరస్వతి శిశు మందిర్ విద్యార్థులు హాజరుకాగా నారాయణపేట జిల్లా ఊట్కూర్ శ్రీ సరస్వతి శిశు మందిర్ విద్యార్థులు తమ ప్రతిభనుచాటి వివిధ బహుమతులు కైవసం చేసుకున్నారు.

పలువురి చేత శభాష్ అనిపించుకుంటున్నారు. ఊట్కూర్ శిశు మందిర్ పాఠశాల విద్యార్థి భాస్కర్ 100మీటర్లు(100 meters), 400మీటర్లు, రిలే, ఖోఖోలో మొదటి బహుమతి, వాసవి 400మీటర్లు, రన్నింగ్, రిలేలో మొదటి బహుమతి, బాలుర ఖో ఖో జట్టు మొదటి బహుమతి, బాలుర యోగసన్ జట్టు మొదటి బహుమతి సాధించిన విద్యార్థులను పాఠశాల ప్రధానచర్యులు విశాల్, కిషోర్ విలేకరులకు తెలిపారు. విద్యార్థులు ప్రతిభ చాటడంతో ఈ రోజు అభినందించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply