సివిల్ సర్వీస్ ఖోఖోలో ఆంధ్రప్రదేశ్‌కు కాంస్యం

సివిల్ సర్వీస్ ఖోఖోలో ఆంధ్రప్రదేశ్‌కు కాంస్యం
విజయవాడ, ఆంధ్రప్రభ : ఈ నెల 19 నుంచి 22 వరకు పుణె లోని శ్రీ శివ్ ఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో జరిగిన ఆల్ ఇండియా సివిల్ సర్వీసు పురుషుల ఖో ఖో పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టు కాంస్య పతకం సొంతం చేసుకుంది. లీగ్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టు 25-22 స్కోర్ తో బెంగళూరు పైన,,25-8 స్కోర్ తో కర్ణాటక పైన,20-4 స్కోర్ తో పుదుచ్చేరి పైన,25-4 స్కోర్ తో మధ్య ప్రదేశ్ పైన ఏకపక్ష విజయాలు సాధించి క్వార్టర్ ఫైనల్స్ కి చేరుకుంది.
క్వార్టర్ ఫైనల్లో ఆర్ సి బి చెన్నై పై 23-4 స్కోర్ తో గెలుపొంది సెమీస్ లో మహారాష్ట్ర చేతిలో 20-12 స్కోర్ తో ఓటమి చెందింది.తృతీయ స్థానానికి జరిగిన పోటీలో 6-4 స్కోర్ తో హర్యానా పై సంచలన విజయం నమోదుచేసి కాంస్య పతకం చేజిక్కించుకుంది. పి ఎల్ పి కుమార్,ఎస్ సురేష్ కుమార్,ఎస్ కిరణ్ కుమార్, డి రాజ్ కుమార్, పి సతీష్, జి చిన్ని, ఎం ముత్తు, జి దేవేంద్ర,పి రవిబాబు, ఏం.వీరయ్య, ఎన్ రాజా, కె రమేష్, జి సంతోష్, ఎస్ ఆదర్శ్,ఎస్ చంద్ర మోహన్ లు రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించి జట్టు విజయానికి కృషి చేశారు.రాష్ట్ర జట్టు పతకం సాధించడం పట్ల రాష్ట్ర ఖో ఖో అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు మడక ప్రసాద్, కె హనుమంతరావు,కృష్ణా జిల్లా కార్యదర్శి ఎం వి సత్య ప్రసాద్ అభినందనలు తెలిపారు.

