sports car | స్పోర్ట్స్ కారు భీభ‌త్సం

sports car | స్పోర్ట్స్ కారు భీభ‌త్సం

భారీగా నిలిచిన ట్రాఫిక్
పలువురికి తీవ్ర గాయాలు

sports car | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఆదివారం ఓ ఫెరారీ స్పోర్ట్స్ కారు బీభత్సం సృష్టించింది. రోడ్ నెం. 45లో అతివేగంతో వెళ్తున్న‌ కారు అదుపుతప్పి పక్క రోడ్లోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో పలు కార్లు, బైక్‌లను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటన సినీ నటుడు నందమూరి బాలకృష్ణ నివాసానికి సమీపంలో చోటుచేసుకుంది. ప్రమాదం ధాటికి వాహనాలు నుజ్జునుజ్జవగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్ర‌మాదంలో రోడ్ నెం. 45లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించే చర్యలు చేపట్టారు.

Leave a Reply