క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు..

క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు..
చిట్యాల, ఆంధ్రప్రభ : క్రీడలతో యువత మానసిక ఉల్లాసంతో పాటు స్నేహభావం పెంపొందించుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కోరారు. సీసీపీఎల్ 4 క్రికెట్ ప్రీమియర్ లీగ్ లోగో క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీసీపీఎల్ అధ్యక్షులు బండిరాజు, కార్య నిర్వహణ అధ్యక్షులు, మాటూరి లవన్ బాబు, కాంగ్రెస్ టౌన్ గ్రామశాఖ అధ్యక్షులు గంగాధరి రవీందర్, చిట్యాల మాజీ ఎంపీటీసీలు కట్కూరి పద్మ నరేందర్, గుర్రపు సునీత తిరుపతి, సర్వ శరత్ కుమార్, అంజిత్, అజయ్ పాల్గొన్నారు.
