SPORTS | ప్రస్తుతం 119 పరుగుల ఆధిక్యంలో ఇంగ్లాండ్

SPORTS | ప్రస్తుతం 119 పరుగుల ఆధిక్యంలో ఇంగ్లాండ్
- ఆఖరి రోజంతా బ్యాటింగ్ చేయకుంటే ఓటమి తప్పదు
SPORTS | వెబ్‌డెస్క్ (స్పోర్ట్స్), ఆంధ్రప్రభ : యాషెస్ సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా జరుగుతున్న ఆఖరి టెస్ట్‌లో ఇంగ్లండ్ (England) ఓటమి దిశగా సాగుతోంది. 184 పరుగుల భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 75 ఓవర్లలో 8 వికెట్లకు 302 పరుగులు చేసింది. క్రీజులో జాకోబ్ బెతెల్(232 బంతుల్లో (Balls) 15 ఫోర్లతో 142 నాటౌట్)తో పాటు మాథ్యూ పాట్స్(0 బ్యాటింగ్) ఉన్నారు. జోరూట్(6), విల్ జాక్స్(0), బెన్ స్టోక్స్(1), జాక్ క్రాలీ(1) తీవ్రంగా నిరాశపర్చగా.. బెన్ డకెట్(42), హ్యారీ బ్రూక్(42) పర్వాలేదనిపించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో బ్యూ వెబ్‌స్టర్(3/51) మూడు వికెట్లు తీయగా.. స్కాట్ బోలాండ్(2/34) రెండు వికెట్లు పడగొట్టాడు. మిచెల్ స్టార్క్, మైకేల్ నెసర్ తలో వికెట్ తీశారు. ప్రస్తుతం ఇంగ్లండ్ 119 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.

518/7 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్ 133.5 ఓవర్లలో 567 పరుగులకు ఆలౌటైంది. ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్(166 బంతుల్లో 24 ఫోర్లు, సిక్స్‌తో 163), కెప్టెన్ (Captain) స్టీవ్ స్మిత్(220 బంతుల్లో 16 ఫోర్లు, సిక్స్‌తో 138 నాటౌట్) భారీ శతకాలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్(3/130), జోష్ టంగ్(3/97), మూడు వికెట్లు (Vikets) తీయగా.. బెన్ స్టోక్స్(2/95) రెండు వికెట్లు పడగొట్టాడు. విల్ జాక్స్, జాకోబ్ బెతెల్ తలో వికెట్ తీసారు. ఆఖరి రోజు ఇంగ్లండ్‌ను త్వరగా ఆలౌట్ చేస్తే ఆస్ట్రేలియాకు విజయం దక్కుతుంది. ఈ మ్యాచ్‌లో గట్టెక్కాలంటే ఇంగ్లండ్ ఆఖరి రోజంతా బ్యాటింగ్ చేయాలి. ఇది అసాధ్యం.
సంక్షిప్త స్కోర్లు:
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 384 ఆలౌట్
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 567 ఆలౌట్
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ 302/8
CLICK HERE TO RAED భారత యువ కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసక సెంచరీ
