SPORTS | బంగ్లాదేశ్‌లో ఐపీఎల్‌ ప్రసారాలపై నిషేధం

SPORTS | బంగ్లాదేశ్‌లో ఐపీఎల్‌ ప్రసారాలపై నిషేధం

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : భారత్-బంగ్లాదేశ్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు క్రీడా రంగానికి కూడా విస్తరిస్తున్నాయి. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను (Mustafizur Rahman) విడుదల చేయడంపై రెండు దేశాల మధ్య వివాదం ముదిరింది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం తమ దేశంలో ఐపీఎల్ ప్రమోషన్, ప్రసారాలపై నిరవధిక నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బీసీసీఐ ఆదేశాల మేరకు ముస్తాఫిజుర్‌ను జట్టు నుంచి రిలీజ్ చేసిన కోల్‌కతా నిర్ణయం ఈ వివాదానికి మూల కారణంగా మారింది.

Leave a Reply