ఉన్నత ప్రమాణాలతో దగ్గరవుతున్న ఇగ్నో దూరవిద్య

ఉన్నత ప్రమాణాలతో దగ్గరవుతున్న ఇగ్నో దూరవిద్య
ఉన్నత విద్యామండలి చైర్మెన్ ప్రొఫెసర్ మధుమూర్తి
భవానిపురం, ఆంధ్రప్రభ : ఇందిరా గాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం 39వ స్నాతకోత్సవం విజయవాడ ప్రాంతీయ కేంద్రం పరిధిలో స్థానిక కొత్తపేట కె బి యన్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఆంధ్ర ప్రదేశ్ ఉన్నత విద్యామండలి చైర్మెన్ ప్రొఫెసర్ కె. మధుముర్తి స్నాతకోపన్యాసం చేస్తూ అత్యంత ఉన్నత ప్రమాణాలతో గత 40 సంవత్సరాల నుండి దేశవ్యాప్తంగా ఉన్నత విద్యనూ అన్నీ వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంచుతూ జాతీయ స్థూల నమోదు నిష్పత్తినీ పెంపొందించేందుకు కృషి చేస్తూ, “మీ ఇంటి వద్దకే విద్య” అనే నినాదంతో ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు.
అనతరం 70 మంది విద్యార్థులకు ప్రత్యక్షంగా డిగ్రీలను ప్రధానం చేసారు. రీజినల్ డైరెక్టర్ డాక్టర్ కె. సుమలత నివేదికను సమర్పిస్తూ దేశవ్యాప్తంగా 3 లక్షల మందికి పైగా డిగ్రీలను ఈ స్నాతకోత్సవంలో అందుకోనున్నారని, అలాగే విజయవాడ ప్రాంతీయ కేంద్రం పరిధిలో 1626 మంది విద్యార్థులు డిగ్రీలు తీసుకునేందుకు అర్హత సాధించారన్నారు. ప్రాంతీయ కేంద్రం పరిదిలో పలు నూతన కోర్సులతో పాటు నూతనంగా ఏర్పాటైన జిల్లాల్లో నూతన అధ్యయన కేంద్రాలను రానున్న విద్యా సంవత్సరం నుండి ప్రారంభించ నున్నట్లు తెలిపారు.

జూలై నుండి ఇగ్నో విజయవాడ ప్రాంతీయ కేంద్రం రాజధాని అమరావతి పరిధిలోని రాయపూడిలో శాశ్వత భవనంలోనికి మారనున్నట్లు తెలిపారు. పోస్టు ద్వారా డిగ్రీలు కావాలని దరఖాస్తు చేసిన వారికి ఈ నెల 8 వ తేది నుండి స్పీడ్ పోస్ట్ ద్వారా పంపనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇగ్నో డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ బి ప్రసాద్ బాబు, డాక్టర్ శరత్ చంద్ర, డాక్టర్ మమత, చెన్ను బాలచందర్ ఇతర ఇగ్నో సిబ్బంది పాల్గొన్నారు.
