పరిసరాల పరిశుభ్రతకు ప్రజలు భాగస్వాములు కావాలి

పరిసరాల పరిశుభ్రతకు ప్రజలు భాగస్వాములు కావాలి
చెత్తను పారేయకుండా కళగా మార్చుకుందాం
మున్సిపల్ కార్యాలయంలో వేస్ట్ టు ఆర్ట్ పై ప్రత్యేక కార్యక్రమం
మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్
స్టేషన్ ఘన్ పూర్ , ఆంధ్రప్రభ : పరిసరాలను శుభ్రంగా ఉంచడంలో ప్రతి ఒక్కరి బాధ్యత అవసరం. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని స్టేషన్ ఘన్ పూర్ మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్ అన్నారు. బుధవారం స్టేషన్ ఘన్ పూర్ మున్సిపల్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వేస్ట్ టు ఆర్ట్ డెకరేషన్‌పై అవ గాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్య క్రమంలో నిరుపయోగ వస్తువులను ఉపయోగించి అందమైన అలంకర ణలు తయారు చేసి ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమం లో నిరుపయోగ వస్తు వులను ఉపయోగించి అందమైన అలంకరణలు తయారు చేయడం ద్వారా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవచ్చని వివరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్ మాట్లాడుతూ..ప్లాస్టిక్ బాటిళ్లు, పాత కాగితాలు, వాడుకలో లేని వస్తు వులతో అందమైన అలంకరణలు తయారు చేయవచ్చని తెలిపారు. ఇంట్లో ఉన్న పాత వస్తువులను పారేయకుండా వాటిని సృజనాత్మ కంగా ఉపయోగిస్తే పరిసరాలు పరిశుభ్రంగా ఉండటంతో పాటు పర్యా వరణానికి మేలు జరుగుతుందని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు ప్రజల్లో అవగాహన పెంచి స్వచ్ఛమైన సమాజ నిర్మాణాని కి దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో శానిటే షన్ ఇన్ స్పెక్ట ర్ లింగయ్య, మున్సిపల్ మేనేజర్ సత్యం, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివా స్, మెప్మా టౌన్ మిషన్ కో ఆర్డినేటర్ వాణి శ్రీ, రీసర్స్ పర్సన్ చిరంజీవి, టిఎల్ఎఫ్ రీసర్స్ పర్సన్ లు వడ్లకొండ మౌనిక, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
