స్వామివారికి ప్రత్యేక పూజలు…
బిచ్కుంద, ఆంధ్రప్రభ : మన్మథ్ స్వామిని దర్శించుకుని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు(Thota Lakshmi Kantharao) ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి సంవత్సరం కపిల్దార్ పాదయాత్ర బిచ్కుంద నుండి సోమలింగ శివాచార్య సోమయ్య అప్ప మహాస్వామి ఆధ్వర్యంలో బిచ్కుంద ప్రాంత భక్తులు కాలినడకన వెళ్తారు.
దీంట్లో భాగంగా జుక్కల్ ఎమ్మెల్యే ఈ రోజు కపిల్దార్ మన్మథ్ స్వామి(Kapildar Manmath Swamy) పాదయాత్రలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసి సోమయ్య అప్ప స్వామి ఆశీర్వాదం తీసుకున్నారు. జుక్కల్ ఎమ్మెల్యే వెంబడి కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

