రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు..

  • మక్తల్ సీఐ రామ్ లాల్

మక్తల్, (ఆంధ్రప్రభ) : నారాయణపేట జిల్లా మక్తల్ మండలం జక్లేర్ పరిధిలో ఇటీవల రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ నియంత్రణను బలోపేతం చేసి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలనే బాధ్యతతో జక్లేర్‌కు చెందిన వెంకటేష్ గౌడ్ సమాజ సేవలో భాగంగా నాలుగు నూతన ట్రాఫిక్ బారికేడ్లను విరాళంగా అందించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ప్రజల భద్రత కోసం ముందుకు వచ్చి ఇలాంటి సేవ చేయడం అత్యంత ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా సీఐ రామ్‌లాల్ మాట్లాడుతూ, ప్రధాన రహదారిపై ప్రమాదాలు నివారించడంలో బారికేడ్లు కీలక పాత్ర పోషిస్తాయని, వీటి ద్వారా రహదారి భద్రత మరింత మెరుగుపడుతుందని తెలిపారు. ప్రజల భద్రత కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం ఎంతో ఆదర్శప్రాయమని పేర్కొంటూ వెంకటేష్ గౌడ్‌ను ప్రత్యేకంగా అభినందించారు.

సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాల్లో యువత ముందుకు రావడం పోలీసు శాఖకు, సమాజానికి ప్రేరణగా ఉంటుందని సీఐ రామ్‌లాల్ అన్నారు. ప్రజల భద్రత పోలీసులకే పరిమితం కాకుండా ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు.
విరాళంగా అందించిన నాలుగు బారికేడ్లను ప్రమాదాలకు గురయ్యే ప్రదేశాల్లో తక్షణమే అమలు చేయనున్నట్లు తెలిపారు. వీటి వినియోగంతో వాహనాల వేగ నియంత్రణ, ప్రమాదాల తగ్గింపు, రాత్రి సమయంలో విజిబిలిటీ మెరుగుపడతాయని ఆయన వివరించారు.

జిల్లా పోలీస్ శాఖ ప్రజల సహకారం పట్ల కృతజ్ఞతలు తెలుపుతూ, ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించడం ద్వారా రహదారి ప్రమాదాలను నివారించవచ్చని సీఐ రామ్‌లాల్ సూచించారు. ఈ కార్యక్రమంలో మక్తల్ ఎస్సై వై. భాగ్యలక్ష్మి రెడ్డి, జక్లేర్ గ్రామ యువత తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply