బాసరలో ఘనంగా శారదీయా నవరాత్రి ఉత్సవాలు

బాసరలో ఘనంగా శారదీయా నవరాత్రి ఉత్సవాలు
బాసర, ఆంధ్రప్రభ : సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం చదువుల తల్లి కొలువైన శ్రీ జ్ఞాన సరస్వతి దేవి సన్నిధిలో శారదీయ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి.ఈ ఉత్సవాలు 9వ రోజుకు చేరుకుంది. ఈ రోజు అమ్మవారు సిద్ధ ధాత్రి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు.
సిద్ధి అంటే ఒక పని సిద్ధించడం, ధాత్రీ అంటే ఇచ్చేది. భక్తులు కోరే పనిని తీర్చే అమ్మవారు.
ఇహ సుఖాలనే కాక, జ్ఞానాన్నీ, మోక్షాన్నీ కూడా సిద్ధిధాత్రీదేవీ ప్రసాదించగలదు. తామరపువ్వులో కూర్చుని ఉండే సిద్ధిధాత్రీ దేవికి నాలుగు చేతులు ఉంటాయి. కమలం, గద సుదర్శన చక్రం, శంఖం ఉంటాయి. ఈ అమ్మవారిని ఆరాధించేవారికి బ్రహ్మజ్ఞానం లభిస్తుందని శాస్ర్తాలు చెపుతున్నాయి. అమ్మవారికి నైవేద్యంగా పరమాన్నం, పిండి వంటలు అందించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు అమ్మవార్లను దర్శించుకుని ఆలయ సన్నిధిలోని అక్షరాభ్యాస మండపాలలో తమ చిన్నారులకు అక్షరాభ్యాస పూజలు జరిపించి అమ్మవారి వద్ద మొక్కులు చెల్లించుకున్నారు.
