విద్యార్థులపై ఎస్పీ తిట్ల దండకం..

విద్యార్థులపై ఎస్పీ తిట్ల దండకం..
- నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి ఫర్మిల అనుచిత వ్యాఖ్యలు
- బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులపై తిట్ల దండకం
- ఎవత్తే సిగ్గులేదా… సిగ్గులేని బతుకులు అంటూ తిట్టిన ఎస్పీ
- ఏం చేస్తారో చేయండి అంటూ విద్యార్థినిలపై మండిపడ్డ ఎస్పీ
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: నిర్మల్ జిల్లాలో విద్యార్థులపై జిల్లా ఎస్పీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆందోళన చేస్తున్న బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులనిల పై తిట్ల దండకం అందుకున్నారు. విద్యార్థులను ఉద్దేశిస్తూ “ఎవత్తే అది సిగ్గులేదా… సిగ్గులేని బతుకులు, ధైర్యముంటే ముందుకు వచ్చి వీడియో తీయండి ..ఏం చేస్తారో చేయండి” అంటూ విద్యార్థినిలను భయాందళనకు గురి చేసింది. దీంతో విద్యార్థులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఒక ఉన్నతాధికారి ఇలా మాట్లాడడం సరైంది కాదని విద్యార్థులు వాపోతున్నారు.
