SP | గ్రామాల్లో ప్రత్యేక నిఘా : ఎస్పీ అఖిల్ మహాజన్
SP | తాంసి, ఆంధ్రప్రభ : గ్రామ పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సోషల్ మీడియా, నగదు, మద్యం పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని కప్పర్ల గ్రామంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఎన్నికల నిబంధనల పై అవగాహన కల్పించారు. శాంతి యుత వాతావరణం లో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. మద్యం, నగదు పంపిణీ చేయకూడదని స్పష్టం చేశారు. ఎన్నికల నిబంధనల ప్రకారం నగదు, మద్యం ఇచ్చిన, తీసుకున్న నేరం కింద పరిగణించ బడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ జీవన్ రెడ్డి, రూరల్ సీఐ ఫణిదర్, ఎస్సై లు జీవన్ రెడ్డి, రాధిక, పోలీస్ సిబ్బంది ఉన్నారు.

