South Zone | పోటీలకు ఎస్ఆర్ కేఆర్ క్రీడాకారులు..

South Zone | భీమవరం, ఆంధ్రప్రభ బ్యూరో : ఈ నెల 27, 28 తేదీలలో విజయవాడ పిబి సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన జేఎన్టీయూకే సెంట్రల్ జోన్ క్రేడా పోటీల్లో వివిధ విభాగాల్లో ఎస్ ఆర్ కేఆర్ క్రీడాకారులు విజేతలుగా నిలిచారు. విజేతగా నిలిచిన ఎస్ ఆర్ కే ఆర్ ఇంజనీరింగ్ కళాశాల క్రీడాకారులను ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ కి, సౌత్ జోన్ పోటీలకు జేఎన్టీయూకే టీం తరఫున ఎంపికైనట్లు కళాశాల అసిస్టెంట్ ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ సిహెచ్ హరిమోహన్ చెప్పారు.
ఎంపికైన క్రీడాకారులను కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతి రాజు, ఇంచార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ బి హెచ్ వి ఎస్ రామకృష్ణంరాజు ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఎంపికైన క్రీడాకారుల వివరాలను అసిస్టెంట్ ఫిజికల్ డైరెక్టర్స్ జి సారిక, వి అవినాష్ లు అందిస్తూ జేఎన్టీయూకే సెంట్రల్ జోన్ చెస్ విభాగములో మెన్ టీం ప్రథమ స్థానంలో నిలిచిందనీ, అదేవిధంగా నెట్ బాల్ మెన్ టీం రనర్స్ గా నిలిచారు. నెట్ బాల్ ఉమెన్స్ లో మూడవ స్థానంలో నిలిచారు.
దీంతో జేఎన్టీయూకే ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ నెట్ బాలుకు మెన్ టీం లో ఎం సాహిత్, కే సాయి తేజను, నెట్ బాల్ ఉమెన్ టీంలో ఆర్ అఖిల శ్రీవల్లిని ఎంపిక చేశారు. అదేవిధంగా సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీకి చెస్ విభాగంలో జేఎన్టీయూకే తరఫున హెచ్ హరిణి ఎంపికయ్యారని తెలిపారు. ఇప్పటికే పలు విభాగాలలో తమ కళాశాల విద్యార్థులు జేఎన్టీయూకే తరఫున సౌత్ జోన్ లో పాల్గొంటున్నారని ఒకేసారి ఇంతమంది విద్యార్థులు అత్యధిక క్రీడల్లో సౌత్ జోన్ కు ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ కాంపిటేషన్ కు కావటం పట్ల కళాశాల యాజమాన్యం క్రీడాకారులను అభినందించారు.
