Soundarya Lahari | సౌందర్య లహరి – 97

97  గిరా మాహుర్దేవీంద్రుహిణగృహిణమాగమవిదో

హరేఃపత్నీంపద్మాంహరసహచరీమద్రితనయామ్

తురీయాకాపి,త్వందురధిగమనిస్సీమ మహిమా

 మహామాయా విశ్వం భ్రమయసిపరబ్రహ్మ మహిషి.

తాత్పర్యం: పరబ్రహ్మమైన సదాశివుడికి పట్టమహిషి వైన జగదంబా! ఆగమశాస్త్ర రహస్యాలు తెలిసిన విద్వాంసులు నిన్ను బ్రహ్మగారి భార్య, వాగ్దేవి అయిన సరస్వతీదేవి గాను, శ్రీ మహావిష్ణువు భార్య అయిన లక్ష్మీదేవి గాను, శివుడి సహధర్మచారిణి అయిన పర్వత రాజపుత్రి పార్వతిగానుచెపుతారు. కాని, నువ్వు ఈ ముగ్గురి కన్న వేరుగా నాల్గవదానిగా ఉండి, ఇటువంటిది అని చెప్పటానికి వీలుకాని, అనిర్వచనీయమై, మహా కష్టసాధ్యమై, అంతులేని మాహాత్మ్యంకలిగినదై, మహామాయాతత్త్వమై, ఈ జగత్తుఅంతటిని అనేక విధాలుగా భ్రమలో పడవేస్తున్నావు.      

  • డాక్టర్ అనంత లక్షీ …

Leave a Reply