79. నిసర్గ క్షీణస్యస్తనతటభరేణక్లమజుషో
నమన్మూర్తేర్నారీతిలకశనకైస్త్రుట్యత ఇవ
చిరం తే మధ్యస్యత్రుటితతటినీ తీర తరుణా
సమావస్థాస్థేమ్నోభవతు కుశలం శైలతనయే.
తాత్పర్యం: ఓ స్త్రీరత్నమైనపర్వతరాజపుత్రీ! వక్షోజాలు అనే రెండు గట్ల (ఒడ్డుల) బరువు చేత అలసట చెంది, కొంచెం వంగినట్టు కనపడుతూ, నెమ్మదిగా నెమ్మదిగావిరిగిపోతుందేమో అనిపిస్తూ, కట్ట తెగిన ఏటి గట్టున ఉన్న చెట్టుతో పోల్చదగిన స్థితిలో ఉన్న సహజంగా మిక్కిలి సన్ననైన నీ నడుముకి కలకాలం క్షేమం కలుగు గాక!
- డాక్టర్ అనంతలక్ష్మి