Regonda |తండ్రి చేతిలో కొడుకు హత్య..

రేగొండ, ఏప్రిల్ 22 (ఆంధ్రప్రభ) : జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రేపాకపల్లిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రేగొండ మండలంలోని రేపాకపల్లిలో తండ్రి కొడుకుని రోకలి బండతో దారుణంగా హత్య చేశాడు. గ్రామస్తుల కథనం ప్రకారం… కుటుంబ కలహలతో తండ్రి మొండయ్య, కొడుకు కాసం ఓదెలు (38) కుటుంబ కలహాలతో మంగళవారం ఉదయం రోకలి బండతో దారుణహత్యకు గురయ్యాడు.

మృతుని భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు, సంఘటన స్థలానికి రేగొండ ఎస్సై సందీప్ కుమార్ చేరుకొని సమగ్ర విచారణ జరిపి, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Leave a Reply