ప్రతి వార్డులోని సమస్యలు పరిష్కరిస్తా..

ఉట్నూర్, ఆంధ్రప్రభ ; ప్రతి వార్డులోని సమస్యలను పరిష్కరిస్తానని ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని బాబాపూర్ గ్రామపంచాయతీ సర్పంచ్ మెస్రం గంగాదేవి ప్రభాకర్ అన్నారు. శుక్రవారం బాబాపూర్ సర్పంచ్ పంచాయతీలోని ఎర్రచిలక ముసల్పాడు వార్డులలో తిరిగి సమస్యలు తెలుసుకున్నారు. తాగునీరు బోరింగ్ ను పరిశీలించి అది పనిచేయడం లేదని తెలపడంతో వెంటనే మెకానిక్ తో మరమ్మతులు చేసి నీటి సమస్య పరిష్కరించినట్లు ఆమె తెలిపారు. ఏ సమస్య ఉన్న తమ దృష్టికి తేవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చంద్రకళ, నాయకులు జంగు రాజు తదితరులు పాల్గొన్నారు.
