Society | తరుగు పేరుతో రైతుల నిలువు దోపిడి…
Society | జక్రాన్ పల్లి, ఆంధ్రప్రభ : జక్రాన్ పల్లి మండలంలోని కొలి ప్యాక్, ప్రాథమిక వ్యవసాయ సహకారం సంఘం అధికారి తరుగు పేరుతో రైతులను నిలువు దోపిడి చేస్తున్నారని, గురువారం రైతులు అధికారులను నిలదీశారు. కొలి ప్యాక్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిదిలోనీ నాలుగు గ్రామాల రైతులు తాము పండించిన వరిధాన్యాన్ని సొసైటీ(Society) ఆధ్వర్యంలో అమ్మకాలు జరుగుతుంటాయి.
రైతులు ఆరుగాలం కష్టించి, వానకు తడిసి ఎండకు ఎండి , చీడ పీడల నుండి పంటను రక్షించుకొని, పెరిగిన రసాయన మందులు, ధరలు యంత్ర రేటు ధరలను అధిగమించి చివరకు సొసైటీ అధికారులు తరుగు పేరుతో నిండా రైతులను నట్టేట ముంచుతున్నారని రైతుల ఆరోపించారు. దినిపై మండలంలోని మనోహర్ బాద్ గ్రామానికి చెందిన రైతులు నిన్న, కొల్లి ప్యాక్, ప్రాథమిక(Primary) వ్యవసాయ సహకార సంఘం వద్దకు వెళ్లి అధికారులను నిలదీశారు. తరుగు పేరుతో సుమారు 200 సంచులకు ఖరీదు కట్టి ఇవ్వలేదని రైతులు ఈ సందర్భంగా తెలిపారు.

1) రైతు పేరు, అల్లూరి రోహిత్ : తనకు చెందిన 9 బస్తాలకు ధర కట్టు ఇవ్వలేదని వాపోయాడు. తమ గ్రామంలో వరి ధాన్యాన్ని పండించిన రైతులు, తూకం వేసిన ఒక లారీ 710 బస్తాలు పంపించగా, 648 బస్తాల(648 bags)కు ఖరీదు కట్టించారని, ఇంకా మిగిలిన 62 బస్తాలను తరుగు పేరుతో కొలి ప్యాక్ సొసైటీ(Coli Pack Society) అధికారులు ధర కట్టివ్వలేదని, దీనితో తమను నిండా ముంచారని రైతు ఆరోపించరు.

2) రోడ్డ బాపురావు రైతు ; తను పండించిన 113 బస్తాలలో 6 బస్తాలను తరుగు పేరుతో నిండా ముంచారని వాపోయాడు. సొసైటీ అధికారులు ప్రతీ పంటకు తరుగు పేరుతో ఇదేవిధంగా మోసాలకు పాల్పడుతున్నారని ఆయన తెలిపారు. గ్రామంలోని రైతులందరినీ తరుగు పేరుతో నష్టపరుస్తున్నారని, దీనిపై అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
అలాగే కౌలు రైతులు పండించిన వరి ధాన్యాన్ని కూడా తరుగు పేరుతో నష్టపరుస్తున్నారని కౌలు రైతు(tenant farmer) మాధవ్ తెలిపారు. తాము పండించిన 114 వరి ధాన్యపు సంచుల్లో 3 వరి ధాన్యం సంచులు తరుగు పేరుతో తక్కువ ఖరీదు కట్టారని రైతు వాపోయాడు. ఏది ఏమైనా అధికారులు దీనిపై దృష్టి పెట్టి తమకు జరిగినటువంటి నష్టాన్ని సరిచేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
దీనిపై కొలి ప్యాక్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యదర్శి దయాసాగర్ ను వివరణ కోరగా.. తాను నిన్న లీవ్ లో ఉన్నానని వచ్చిన తర్వాత అన్ని పత్రాలను పరిశీలించి రైతులకు న్యాయం చేస్తానని తెలిపారు.

