Social media | ఎన్నికల దృశ్య..ప్రత్యేక నిఘా..

Social media | ఎన్నికల దృశ్య..ప్రత్యేక నిఘా..

  • ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్

Social media | తాంసి, ఆంధ్రప్రభ : గ్రామ పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సోషల్ మీడియా(Social media), నగదు, మద్యం పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్(Akhil Mahajan) పేర్కొన్నారు. ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని కప్పర్ల గ్రామంలో పర్యటించారు.

ఈ సందర్భంగా ఎన్నికల నిబంధనల పై అవగాహన కల్పించారు. శాంతి యుత వాతావరణం లో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని సూచించారు. మద్యం, నగదు పంపిణీ చేయకూడదని పేర్కొన్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం(according to the rules) నగదు,మద్యం ఇచ్చిన,తీసుకున్న నేరం కింద పరిగణించ బడుతుందని అన్నారు.

గ్రామస్తులు, యువత అనవసర విషయాల్లో వెళ్లకుండా చూడాలని చెప్పారు. అనంతరం గ్రామంలో పోలిస్ మార్చ్(Police march) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ జీవన్ రెడ్డి, రూరల్ సీఐ ఫణిదర్,ఎస్సై లు జీవన్ రెడ్డి, రాధిక,పోలీస్ సిబ్బంది ఉన్నారు.

Leave a Reply