Social media | అసక్తికర పోస్ట్

Social media | అసక్తికర పోస్ట్

  • ఈడెన్ గార్డెన్స్ అద్భుతానికి నేటితో 25 ఏళ్లు పూర్తి
  • 2001లో ఆస్ట్రేలియాపై విరోచిత పోరాటం చేసిన లక్ష్మణ్ , ద్రవిడ్
  • లక్ష్మణ్ 281, ద్రవిడ్ 180 పరుగులు వద్ద ఓట్

Social media | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ ; మాజీ క్రికెట్ బ్యాటర్, బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ ఆసక్తికర పోస్ట్ చేశారు. 25 ఏళ్ల క్రితం ఈడెన్ గార్డెన్స్‌లో నేను, రాహుల్ పంచుకున్న భాగస్వామ్యం ఎప్పటికీ ప్రత్యేకం. భారత్ ఒడిపోతుంది అనుకున్న దశలో.. మేం నమ్మకం, సహనం, పట్టుదలను ఎంచుకున్నాం.

ఆ భాగస్వామ్యం కేవలం పరుగుల గురించి మాత్రమే కాదు, ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకం, టీమ్‌వర్క్, ప్రతి సెషన్‌ కోసం పోరాడటం గురించి, రాహుల్‌తో కలిసి ఆ ప్రయాణంలో పాలుపంచుకున్నందుకు గర్వంగా ఉంది. క్రికెట్‌లో పునరాగమనాలు ఎప్పుడైనా సాధ్యమేనని గుర్తుచేసిన టెస్టు అది” అని ద్రవిడ్‌తో కలిసి ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

2001లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో భారత్ ఆస్టేలియాకు టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. తొలి టెస్టులో భారత్ ఘోర ఓటమి పాలైంది. అయితే రెండో టెస్టులో నాలుగో రోజు ఉదయం భారత్ స్కోరు 254/4, ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 20 పరుగులు వెనుకబడే ఉంది. చేతిలో ఆరు వికెట్లు మాత్రమే ఉండటంతో ఆసీస్ గెలుస్తుందన్న దశలో లక్ష్మణ్, రాహుల్ ద్రవీడ్ లు కలిసి విరోచిత పోరాటం చేశారు.

ఈ మ్యాచ్ లో 281 పరుగుల చేసి వీవీఎస్ లక్ష్మణ్ చరిత్రలో నిలిచిపోయారు, అప్పటికి ఇదే ఓ భారత బ్యాటర్ చేసిన అత్యధిక టెస్ట్ స్కోరు కావడం విశేషం, మరోవైపు ద్రవిడ్ 180 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌ను 657/7 పరుగుల భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం ఆస్ట్రేలియా 212 పరుగులకే ఆల్ ఓట్ అయ్యింది.. ఇందుల్లో హర్భజన్ సింగ్ ఆరు వికెట్లతో చెలరేగి భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.

Leave a Reply