స్మృతి సూప‌ర్ సెంచ‌రీ !!

  • వన్డే క్రికెట్‌లో చరిత్రాత్మక ఘనత

భారత మహిళా క్రికెట్‌లో కొత్త రికార్డు పుట్టింది. టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన ఢిల్లీలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ చివరి మ్యాచ్‌లో విరుచుకుపడుతూ అద్భుతమైన శతకం నమోదు చేసింది.

ఈ శతకం కేవలం మరో హండ్రెడ్ మాత్రమే కాదు… వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా సెంచరీ బాదిన తొలి భారత బ్యాటర్‌గా ఆమె చరిత్రలో నిలిచిపోయింది.

50 బంతుల్లో శతకం – కొత్త మైలురాయి

మ్యాచ్ ప్రారంభం నుంచే దూకుడు ప్రదర్శించిన మంధాన 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసింది. దాంతో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డు కూడా తన ఖాతాలో వేసుకుంది. ఆపై బౌండ‌రీల వర్షం కురిపిస్తూ కేవలం 50 బంతుల్లోనే సెంచరీని అందుకుంది. ఈ ఇన్నింగ్స్‌లో ఆమె 14 ఫోర్లు, 4 సిక్స్‌లు బాదింది.

మూడవ వన్డేలో మంధాన 125 పరుగులు (63 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్స్‌లు) చేసి ఔట్ అయింది. హర్మన్‌ప్రీత్ కౌర్‌తో కలిసి 121 పరుగుల విలువైన భాగస్వామ్యం అందించింది. ఈ సిరీస్‌లోనే ఆమె రెండు సెంచరీలు (117, 125) బాదగా, తొలి వన్డేలో 58 పరుగులు చేసింది. వన్డే ప్రపంచకప్ 2025 ముందు మంధాన ఇలాగే అగ్రస్థాయిలో ఆడటం టీమిండియాకు బలాన్నిస్తోంది.

Leave a Reply